top of page

ఆపరేషన్ Vi - E3

ఎపిసోడ్ 3


ఎపిసోడ్ 1 చదువుటకు - క్లిక్ చేయండి!


తనకి తెలిసిన 'గౌరి'ని పట్టుకుని 'వైష్ణవి' అంటుందేంటి అని కన్ఫ్యూజన్ లో పడ్డాడు విజయ్.


"విజయ్.. వైష్ణవి ఇప్పుడు హాస్పిటల్ లో ఉంది. తన మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది. మీరు మీ ఊర్లో తనని సేవ్ చేసి నా దగ్గరకి పంపించారు. కానీ, ఈ ఊర్లో కూడా ఆ రాక్షసులు తనని వెతుక్కుంటూ వచ్చారు. ఎప్పుడేం జరుగుతుందా అని టెన్షన్ గా ఉంది!" అని జరిగింది చెప్పుకొచ్చింది ఆ అమ్మాయి.


విజయ్ కి మాత్రం పూర్తిగా అర్థం కాలేదు. ఈ లోగా 'ప్రకాష్ కాలింగ్...' అంటూ విజయ్ ఫోన్ మోగింది.

"చెప్పరా..."


"అరే! నువ్వెక్కడున్నా త్వరగా ఇంటికొచ్చేయ్!" చాల కంగారుగా చెప్పాడు ప్రకాష్.


"ఏరా ఏమైంది?" అనుమానంగా, కంగారుగా అడిగాడు విజయ్.


"ఇప్పుడు నువ్వు ఉన్న చోటే కాసేపుంటే నీ మీద మళ్ళీ అటాక్ జరుగుద్దని ఇప్పుడే ఇన్స్పెక్టర్ ఇంటికి కాల్ చేసి చెప్పారు!"


"అటాక్ ఆ! అయినా.. ఆయనకేలా తెలుసు?!" అని ఆశ్చర్యంగా, అనుమానంగా అడిగాడు విజయ్.


"అదంతా నాకు తెలీదు రా.. నువ్వు ముందు అర్జెంటు గా ఇంటికి రా...!" అని మరింత కంగారుగా చెప్పాడు ప్రకాష్.


"సరే వెంటనే వస్.." అని అంటుండగా విజయ్ చేతికి ఓ రాడ్ వచ్చి బలంగా తగిలింది. దాంతో చేతిలో ఉన్న ఫోన్ కింద పడిపోయింది. తను మాట్లాడుతూ వెనక్కి తిరుగుతున్నసమయంలో తగలడం వల్ల తలకు తగలాల్సింది తృటిలో తప్పి చేతికి తగిలింది. ఒక్కసారిగా అలా జరగడంతో అక్కడి స్థానికులు, ఆ అమ్మాయి ఉలిక్కిపడతరు.


అప్పుడు ఆ ఫోన్ తీసుకుంటూ... "మీరు వెళ్లిపోండి, నేను హాస్పిటల్ కి వస్తాను" అన్నాడు ఆమెతో.


అప్పుడు ఆమె, "అయ్యో రక్తం!" అని కంగారుపడుతుంది విజయ్ చేతికి తగిలిన దెబ్బని చూపిస్తూ.


"అది నేను చూసుకుంటా.. మీరు వెళ్ళండి!" అని కొంచెం గట్టిగ అరిచాడు తనకేం అవుతుందో అనే కంగారుతో.

అలా అని, తనని కొట్టిందెవరా అని జనాల్లో చూస్తున్నాడు తీక్షణంగా... కళ్ళు వేగంగా కదులుతున్నాయి. సరిగ్గా అదే సమయంలో ఇందాక విజయ్ ని గుద్దిన వాడు కాస్త దూరంలో విజయ్ నే గమనిస్తూ ఉండటం విజయ్ చూసాడు. దాంతో వాడి వెనుక పరిగెత్తాడు.


అలా వాడు విజయ్ ని పరిగెత్తించి ఓ నిర్మానుష్య ప్రదేశంలో ఆగాడు.

అక్కడికి మరికొంతమంది రౌడీలు కూడా వచ్చి చేరతారు. అప్పుడు వారికీ, విజయ్ కి మధ్య మళ్ళీ చిన్న ఫైట్. చివరిలో అందరూ చిక్కినట్టే చిక్కి అక్కడి నుండి పారిపోతారు.


ఆ ఫైట్ కంప్లీట్ అయ్యాక...

"అసలు నా చుట్టూ ఏం జరుగుతుంది.. నేను గౌరీ కోసం వస్తే, మధ్యలో ఈ వైష్ణవి ఎవరు? తనేమో గౌరీయే వైష్ణవి అంటుంది. ఒకవేళ గౌరీయే వైష్ణవి అయితే.. గౌరీ నాతో తన పేరు వైష్ణవి అని కాకుండా గౌరీ అని ఎందుకు చెప్పింది? గౌరీయే వైష్ణవి అయితే, నిన్న చీకట్లో, ఆ బిల్డింగ్ లో ఆ బాడీ తనదేనా? ఆ అమ్మాయి చెప్పినట్టు తనింకా బతికే ఉందా? తనని తెలీక కాపాడుకోలేకపోయానా? ఛ... అన్నీ ప్రశ్నలే.. ఒక్కదానికే సమాధానం లేదు! గౌరిని ఎట్టిపరిస్థితుల్లో కలవాలి, తనని కాపాడుకోవాలి!" అని మనసులో అనుకుంటూ ముందుకి నడుస్తుండగా మళ్ళీ ఆ అమ్మాయి ఎదురయ్యింది.


"అదేంటి మీరు వెళ్లిపోలేదా?" అని అడిగాడు విజయ్.


"ముక్కు మొహం తెలియని ఓ అమ్మాయిని అప్పుడు ప్రాణాలకు తెగించి కాపాడావు... ఇప్పుడు నీ ప్రాణాలు రిస్క్ లో ఉన్నాయంటే ఎలా వెళ్ళిపోతాను! పద.." అని అంది తను.


అలా వాళ్లిద్దరూ ఇందాకటి చోటుకి చేరుకున్నారు.

"నువ్విక్కడే ఉండు.. నేను కార్ తీసుకొస్తాను" అంటూ ఆ అమ్మాయి రోడ్ కి అవతలి వైపు పార్క్ చేసున్న కార్ దగ్గరకు వెళ్ళింది.


కార్ డోర్ అన్లాక్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఓ మినీ వ్యాన్ ఆగి, ఓ ఇద్దరు తనని బలవంతంగా అందులోకి లాగి, తీసుకెళ్ళిపోతారు. రోడ్ కి అవతలి వైపు ఉన్న విజయ్ స్పందించి అటు వెళ్ళేలోపు వాళ్ళు వెళ్ళిపోతారు. వ్యాన్ వెనుక పరిగెడుతూ పరిగెడుతూ, మధ్యలో ఒకరు అలా బైక్ దిగి సిగెరెట్ కోసం ఆగితే, వెంటనే ఆ బైక్ తీసుకుని వ్యాన్ ని వెంబడించడం మొదలుపెట్టాడు.


అలా మొత్తం మీద వాళ్ళు, విజయ్ ఓ గోడౌన్ లోకి చేరుకున్నారు.

విజయ్ లోపలకి వెళ్లేసరికి ఆ అమ్మాయిని వాళ్ళు దాచేస్తారు. అప్పడు అక్కడి రౌడీలతో మళ్ళీ ఫైట్. కానీ, ఈ సారి విజయే బాగా గాయపడ్డాడు. దాంతో విజయ్ నిస్సత్తువతో కుప్ప కూలిపోయాడు. సరిగ్గా అదే సమయానికి ఇన్స్పెక్టర్ ఫుల్ బెటాలియన్ తో అక్కడికి వచ్చారు. పోలీసు రాకని పసిగట్టి, ఆ రౌడీలు అక్కడి నుండి పారిపోయే ప్రయత్నం చేసారు. కానీ, పోలీసులు కొంతమందిని పట్టుకున్నారు. ఆ అమ్మాయిని కూడా విడిపించి తీసుకొచ్చారు పోలీసులు.


పోలీసుల వెనుక వచ్చిన ప్రకాష్ విజయ్ ని లేపే ప్రయత్నం చేస్తున్నాడు. విజయ్ స్పృహలోకి వచ్చాడు.

"అరేయ్ ప్రకాష్! సర్ ని పిలవరా.." అని ఓపిక తెచ్చుకుని అడిగాడు విజయ్.


దాంతో "సార్.." అని గట్టిగ అరిచాడు ప్రకాష్.


వెంటనే ఇన్స్పెక్టర్ విజయ్ దగ్గరకు వచ్చాడు.

అప్పుడు విజయ్, "సర్, వెంటనే సిటీ హాస్పిటల్ దగ్గర సెక్యూరిటీ పెంచండి.. వైష్ణవి ఇప్పుడు అక్కడే ఉంది. తనని మనం ఎలాగైనా కాపాడాలి సర్! అలాగే నన్ను కూడా అదే హాస్పిటల్ లో అడ్మిట్ చేయండి.." అని అన్నాడు విజయ్ ఒకో పదాన్ని కూడబలుక్కుంటూ.


ఇంతలో ఆంబులెన్స్ వస్తే, విజయ్ ని అందులోకి ఎక్కించారు.


"వస్తున్నా గౌరీ... నీ దగ్గరికే వస్తున్నా...!" అని తనలో తానే అసంకల్పితంగా కలవరిస్తున్నాడు విజయ్...


ఫ్లాష్ బ్యాక్


ఓ చిన్న టౌన్; ఓ బంగాళా పెంకుటిల్లు; రాత్రి సమయం.

విజయ్ వరెండాలో ఒళ్ళు విరుచుకుంటూ బయట ఉన్న గార్డెన్ లో ఏదో కదులుతున్నట్టు ఉంటే ఏంటా అని వెళ్లి చూసాడు. ఎవరో ఒక అమ్మాయి దాక్కుని ఉండటం గమనించాడు.

అప్పుడు, "ఓయ్ పిల్లా, ఎవరు నువ్వు.. ఇక్కడేం పని?" అని అడిగాడు అనుమానంగా, కాస్త గట్టిగా.


అప్పుడు తను ఉలిక్కిపడి వెన్నక్కి తిరిగింది. బయట వేసిన చిన్న దీపపు వెలుగులో ఆమె ముఖం కనిపించింది. ఎంతో అమాయకంగా, భయ-భయంగా, కంగారుగా చూసింది.


అప్పుడు విజయ్, "నిన్నే... నీ పేరేంటి?" అని మళ్ళీ గట్టిగా అడిగాడు.


దానికి తను రెండు సెకన్లు ఆలోచించి, "గౌరీ" అని చెప్పింది తడబడుతున్న గొంతుతో.


"ఆ అయితే.." మళ్ళీ గద్దించినట్టు అడిగాడు విజయ్.


సరిగ్గా అదే సమయానికి విజయ్ నాన్న లోపలి నుండి వచ్చి అక్కడ నిలబడ్డారు.


"అయ్యో... కాస్త నెమ్మదిగా మాట్లాడండి.. మా మావయ్య డబ్బులకోసం ఓ తాగుబోతోడికి ఇచ్చి కట్టబెడదాం అని చూస్తున్నాడని.. ఇంట్లో నుండి పారిపోయి వచ్చేసానండి. మా మావయ్య మనుషులు బయట నన్ను వెతుకుతున్నారు. ఇప్పుడు దొరికానంటే ఇక అంతే!" అని దీనంగా ముఖం పెట్టి తన గోడంతా విన్నవించుకుంది.


"మీ మావయ్య అలా చేస్తుంటే.. మీ అమ్మ నాన్న ఏమీ ఆపట్లేదా?" అని అడిగాడు విజయ్ నాన్న.


"నాకు ఊహ తెలిసే టైంకే అమ్మ, నాన్న లేరండి" అని అంది తను జాలిగా.


ఆ మాట విన్న ఇద్దరూ ఆ అమ్మాయి వైపు జాలిగా చూసారు.


"సారీ అమ్మ! సరే.. ఈ రాత్రికి మా ఇంట్లో ఉందువుగాని, తెల్లారగానే మీ మావయ్యతో నేను మాట్లాడతా సరేనా." అని అడిగాడు విజయ్ నాన్న.


"అయ్యో వద్దండి.. వాళ్ళు ఎవరి మాట వినరు, రాక్షసులు! నాకు సిటీ లో ఓ ఫ్రెండ్ ఉంది. తన దగ్గరికి వెళ్ళిపోతాను" అని చెప్పింది గౌరి.


"సరే అమ్మ నీ ఇష్టం! పద.." "అరేయ్ విజయ్.. ఆ అమ్మాయికి ఏం కావాలో చూసి, వచ్చి పడుకో!" అని విజయ్ నాన్న లోపలకి వెళ్లారు.


దాంతో విజయ్ తనని లోపలకి తీసుకెళ్లి "మీరు ఈ ముందు గదిలో పడుకోండి..." అని తనకి దిండు, దుప్పటి, వాటర్ బాటిల్ ఇచ్చాడు.


"ఇందాక కొంచెం హార్ష్ గా మాట్లాడాను ఏమనుకోకండే..." అని అన్నాడు కాస్త మొహమాటంగా నవ్వుతూ.


అందుకు తను, "ఇట్స్ ఓకే! పర్లేదు.." అని అంది నవ్వుతూ.


"ఇంకేమైనా అవసరముంటే మొహమాట పడకుండా పిలవండి!"


"ఓకే అండి... థ్యాంక్ యు, గుడ్ నైట్!"


"గుడ్ నైట్!" అని చెప్పి విజయ్ కూడా లోపలికి వెళ్ళిపోతాడు.


అప్పుడామె, బ్యాగ్ లో నుండి ఓ పుస్తకం తీసి, "ఊరు వాళ్ళు చెప్పినట్టు చాలా మంచివాళ్ళు ఇద్దరూ! ఆ రాక్షసుల నుండి నన్ను నేను కాపాడుకోవడానికి ఆ దేవుడే వీళ్ళ ఇంటిని చూపించాడేమో అనిపించింది. ఈ రాత్రి గడిచేక, రేపు పరిస్థితి చూసి నా ఫ్రెండ్ దగ్గరకి వెళ్ళిపోతా...." అని రాసుకుని, డైరీ మూసేసి, లైట్ ఆపి పడుకుంటుంది.


... ఇంకా ఉంది!


ఎపిసోడ్ 2 చదువుటకు - క్లిక్ చేయండి!

19 views0 comments

Recent Posts

See All

Comments


bottom of page