ఎవరి జననమూ అకారణంగా సంభవించదు!
ఆ కారణాన్ని సత్వరముగా గ్రహించి,
ఆ మరుక్షణం నుండి ప్రతిక్షణం నీ శరీరంలోని ప్రతికణం
దాని కోసమే పరితపించాలి!
ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేసే శబ్దం కూడా
నీకు నీ కర్తవ్యాన్ని గుర్తుచేయాలి!
నీ మెదడు నుండి జనించే ప్రతీ ఆలోచన
దాన్ని సాధించమని నిన్ను ప్రేరేపించాలి!
నిన్ను పరీక్షించదలచిన విధి కూడా
నీ పట్టుదలను చూసి నివ్వెరపోవాలి!
గెలుపు కోసం నువు చేసే పోరాటం చూసి
ఆ గెలుపే నిను చేరుకోవడానికి ఆరటపడాలి!
తిప్పలు పెట్టదలిచి నీ దరికొచ్చిన ముప్పేదైనా...
ఉప్పెనంత ధైర్యందాల్చిన నీ గుప్పెడు గుండెను చూసి బెదరక మానదా!
పెను ప్రమాదమైనా... ప్రతిఘటించి పోరాడే
నీ ఆత్మస్థైర్యాన్ని జూచి వెను తిరిగి పారిపోదా!
నీయంతు చూడ వచ్చిన విపత్తు సైతం
నీ సత్తువ చూసి నీరుగారిపోదా!
పరిస్థితి ఏదైనా, ప్రమాదపు పరిధి ఎంతున్నా...
ఈ యుద్ధంలో నిను గెలిపించే నీ సైన్యం నీ ధైర్యం!
--- హేమంత్ కారిచర్ల
Comments