తెల్లకాగితమే నా ప్రేయసి.. ఎందుకంటే, సంతోషమైనా, బాధైనా, మరేదైనా.. నా భావాలను నిత్యం పంచుకునే నా తోడు! మా ఇద్దరినీ కలిపే వారధి నా 'కలం'!
అక్షరాలలో ఆనందాన్ని వెతుకుతూ, పదాలతో కలిసి పయనిస్తూ సాగిస్తున్న నా జీవిత ప్రయాణానికి గమ్యం ఏమవుతుందో నేను చెప్పలేను గాని, నాకు, నేను రాసే ప్రతీ అక్షరానికి చిరునామా మాత్రం ఈ 'Hemanth Stories'.
ఓ పక్క మనుషులలో ఉన్న సామాజిక స్పృహను ఎప్పటికప్పుడు తట్టి లేపే ప్రయత్నం చేస్తూనే, నను నిత్యం ప్రోత్సహించే నా ప్రియమైన పాఠకుల కోసం మనసా వాచా కర్మేణా వినోదాన్ని అందించే విధంగా రచనలు చేస్తాను.
మీరు ఇందులో మనసుకి హత్తుకునే, ఆలోచింపచేసే కథలు, కవితలు, వ్యాసాలు, సమీక్షలు మన తెలుగులో (కొన్ని ఆంగ్లంలో) చూడచ్చు, చదవచ్చు, ఆనందించచ్చు, ఆ ఆనందాన్ని అందరితో పంచుకోవచ్చు!
కాబట్టి, ఒక్కసారి చూడండి, మీకు విషయం నచ్చితేనే, వెబ్సైట్ అడుగున subscribe ఆప్షన్ ఉంటుంది, subscribe చేసుకోవచ్చు.. లేదంటే లేదు!
--- మీ హేమంత్ కారిచర్ల
Already subscribed