నే వెళ్లే దారిన అన్నీ ముళ్ళు
వేసే ప్రతి అడుగుకు అడ్డుపడి గిల్లు
ఆ బాధకు చెమ్మగిల్లితే రెండు కళ్లు
ఆ చెమ్మను తుడిచేందుకు పుట్టాయి కొన్ని వేళ్లు
మనసున్న మాణిక్యాలు వీళ్ళు
నా పై కురిపించే ప్రేమ జల్లు
ఆ జల్లుకి కొట్టుకుపోయి బాధలు.. చేరుకుంటాయి వాటి ఊళ్లు
వీళ్లే నా బంగారు తల్లులు, నా చిట్టి చెల్లెళ్లు!
బదులు ఏమిచ్చినా తీర్చుకోలేను మీరిచ్చే ప్రేమ ఋణాలు!
--- మీ అన్నయ్య హేమంత్ కారిచర్ల
Comentários