ప్రేమ అన్నది వ్యక్తపరచడానికి, దాయడానికి కాదు.
కోపాన్ని దాయచ్చు... ఎందుకంటే, అది మనుషుల మధ్య దూరాన్ని పెంచుతుంది కాబట్టి.
ద్వేషాన్ని దాయచ్చు... అది ఇద్దరు వ్యక్తుల మధ్య వైరాన్ని పెంచుతుంది కాబట్టి!
ఇలా బంధాల మీద, బంధుత్వాల మీద దుష్ప్రభావం చూపే భావాలను, భావోద్వేగాలను దాచచ్చు.
కానీ, ప్రేమను దాచకూడదు. దాన్ని ఎప్పటికప్పుడూ వ్యక్తపరుస్తూ ఉండాలి. అది తల్లిదండ్రులు - పిల్లలు అయినా, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, అన్నాచెల్లెళ్ళు, అక్కతమ్ముళ్ళు అయినా, గురు-శిష్యులైనా, స్నేహితులైనా, ప్రేమికులైనా, భార్యాభర్తలైనా, మరెవరైనా...
"నేను ఎంతో బలమైన సందర్భం వస్తే గానీ ఎదుటి వ్యక్తి మీద ఉన్న ప్రేమను వ్యక్తపరచను" అంటే, అది ఎప్పుడొస్తుంది? నువ్వెప్పుడు చెప్తావు?
మనం చెప్పకపోయినా ఆర్థం అవుతుంది. కానీ, మనం వ్యక్తపరిస్తే అది అందంగా ఉంటుంది!
వ్యక్తపరచడం అంటే మాటల్లో చెప్పడం కాదు , చేతల్లో చూపించడం!
పెద్ద పెద్ద బాహుమతులే ఇవ్వక్కర్లేదు.. ఎంత పనిలో ఉన్నా కాస్త సమయం కేటాయించడం, బాధలో ఉన్నప్పుడు కాస్త ఓదార్పు, ఇలా ప్రేమతో కూడిన చిన్న చిన్న చర్యలే మనల్ని ప్రేమించే వ్యక్తికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి!
ఇన్ని రోజులు అని ఓ లెక్క అంటూ లేని బ్రతుకులు మనవి! అందుకే, ఉన్నప్పుడే ప్రేమించాలి. ఈ క్షణమే ప్రేమించాలి, దాన్ని వ్యక్తపరచాలి!
... మీ హేమంత్ కారిచర్ల
Comments