శుభ స్వాగతం!

తిమిరాన్ని తరిమే రవి కిరణానికి స్వాగతం,
ఆ రవితేజాన్ని నింపుకునే ఉదయానికి స్వాగతం,
ఆ తేజోదయాన్ని సూచించే సమయానికి స్వాగతం,
నష్టం రాదని స్పష్టం చేసే నువ్వు నమ్మిన నీ కష్టం తెచ్చే ఫలితాలకు స్వాగతం ,
బాధలు వద్దని వాదన చేసి, నీ వేదన తీర్చే ఆనందానికి స్వాగతం,
నిరాశ నిస్పృహలు నీ గత నిశ్వాసతో నిను విడిచే...
నీ ఉచ్చ్వసై నిను చేరే ఆత్మా విశ్వాసానికి స్వాగతం...!
స్వాగతం సుస్వాగతం.. శుభ స్వాగతం...
ప్లవ నామ సంవత్సరమా స్వాగతం!

అందరికీ శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!

..మీ హేమంత్ కారిచర్ల

8 views0 comments

Recent Posts

See All